ఒక నెఫ్రోలజిస్ట్ గా నా ప్రాక్టీస్ లో రోజుకి ఎంతో మంది పేషెంట్స్ ని చూస్తున్నాను, ఎన్నో సర్జరీస్, మరెన్నో ఆపరేషన్స్... కానీ ఒక పేషెంట్ గురించి, ముఖ్యంగా పేషెంట్ తాలూకు, తన కొడుకు పడిన కష్టం ,ఆలోచించిన విధానం గురించి నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను.

కెన్యా లో అభే అని,ఇరవైయేడు ఏళ్ళ కుర్రాడు .అరవై ఏళ్ళ తన తల్లికి షుగర్ వల్ల రెండు కిడ్నీలు పూర్తిగా పాడవటం తోటి, డయాలసిస్ చేయించాలని ,తన చెల్లితో కలసి, తల్లిని ఇండియాకి తీసుకొచ్చాడు . హైదరాబాద్ లో పలు హాస్పిటల్స్ తిరుగుతూ,అలా ఒక రోజు నా దగ్గరకు రావటం జరిగింది.మా హాస్పిటల్ లో అన్ని టెస్ట్స్ చేసాక, పెర్మనెంట్ గా డయాలసిస్, లేదంటే కిడ్నీ మార్పిడి చేయించుకోవాలి అని చెప్పినప్పుడు, అభే ఆలోచించుకొని కిడ్నీ మార్పిడి కోసం ముందుకొచ్చారు.అభే ,తన చెల్లి ఇద్దరు కూడా తన తల్లి కోసం కిడ్నీ దానం చేయటానికి ముందుకు రాగ ,తన చెల్లికి పద్దెనిమిది ఏళ్ళు మాత్రమే ఉండటం తో తనని నిరాకరించడం జరిగింది.కానీ అభే ఏది ఏమైనా తన తల్లికి కిడ్నీ ఇవ్వాలి అని నిర్ణయించుకున్నాడు .తండ్రి సోమాలియా దేశానికి చెందిన వాడు కాబట్టి, అటు సోమాలియాన్ మరియు కెన్యా ఇరు దేశాల అంగీకారం కావలసివొచ్చింది . సమయం లేకున్నా, అభే అలుపు ఎరగకుండా తన తల్లి కోసం ,ఇరు దేశాల ఆఫీసర్స్ చుట్టూ పట్టుదలతో తిరిగి చివరికి ఎంబసీ నుంచి అంగీకార పత్రం తెచ్చుకున్నాడు .పైగా తల్లికి హెపటిటీస్ బి, లివర్ కి సంబందించిన వైరల్ ఇన్ఫెక్షన్తో బాధ పడటం,దాని ట్రీట్మెంట్ కోసం మరియు,క్లీన్స్ కోసం ఓపిక బట్టటం జరిగింది . ఓపక్క అంగీకార పత్రాల కోసం తిరుగుతూ మరో పక్క తన తల్లిని వారానికి మూడు రోజులు క్రమం తప్పకుండ డయాలసిస్కి తీసుకొచ్చేవారు.ఆ తర్వాత అన్ని అంగీకార పత్రాలతో తెలంగాణ డిఎంఈ ఇంప్లాంట్ కమిటీ ముందు హాజరై క్లీన్స్ తెచ్చుకున్నాడు.కమిటీ పెర్మిషన్ వచ్చాక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి, ఆపరేషన్ విజయవంతంగా పూర్తిచేయటం జరిగింది. కిడ్నీ డొనేషన్ లో మాత్రమే ఒక నార్మల్ పర్సన్ కి సర్జరీ అవసరం పడుతుంది.ఆపరేషన్ తరువాత తన కి షుగర్ వల్ల వుండ్ ఇన్ఫెక్షన్ వచ్చినా క్రమం తప్పకుండ హాస్పిటల్కి తీసుకొచ్చి ఇంజక్షన్ చేయించాడు. క్రమం గా కిడ్నీ మెరుగవ్వటం, వుండ్ హీల్ అవ్వటం జరిగింది .

కానీ దేశం కానీ దేశం లో , ఇరవైయేడు ఏళ్ళ వయసులో తన తల్లి కోసం తాను పడిన తపన నన్ను కదిలించింది, అబ్బుర పరిచింది నేను నా ఫ్యామిలీకి ఎం చేస్తున్నాను అని ఆలోచించేలా చేసింది.

-Dr.Kranthi Kumar Kalashikam